Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాది సుపరిపాలన: సీఎం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పాలనను తానే మెచ్చుకున్నారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఆయన ఈ రోజు అమ్మహస్తం పథకాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. దిగజారిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టింది తామేనని ముఖ్యమంత్రి చెప్పారు. బీసీలకు 4027కోట్లు ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ సర్కారుదేనని, మైనారిటీలకు ఈ ఏడాది 1027కోట్లు ఖర్చు చేయనున్నామని చెప్పారు.

ఉద్యమాలలోనూ చదువులకు ఆటంకం కలగకుండా చూశామని చెప్పుకొచ్చారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించక తప్పడం లేదన్నారు. తన సొంత నియోజకవర్గం మాదిరిగా రాష్టంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మళ్లీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.

More Telugu News